Home > Movies - Movie News
అల్ట్రా గ్లామరస్‌ తాప్సీ.!

సీరియస్‌ మూవీస్‌తో తాప్సీకి బోర్‌ కొట్టేసిందట. సౌత్‌లో అన్నీ గ్లామరస్‌ పాత్రలే వచ్చాయంటూ బాలీవుడ్‌కి వెళ్ళాక కొత్త కథ విన్పిస్తోన్న తాప్సీకి, అక్కడిప్పుడు సీరియస్‌ మూవీస్‌ బోర్‌ కొట్టేశాయంటే, తాప్సీ తీరు చాలా తేడాగానే వున్నట్టుంది కదూ.! 

'పింక్‌', 'నామ్‌ షబానా' సినిమాల తర్వాత తాప్సీ బాలీవుడ్‌లో కంప్లీట్‌ మేకోవర్‌ కోసం ట్రై చేస్తోంది. అప్పుడెప్పుడో సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన 'జుద్వా' సినిమాకి సీక్వెల్‌ తీస్తున్నారిప్పుడు. అందులో తాప్సీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా కోసమే తాప్సీ అల్ట్రా గ్లామరస్‌గా కనిపించబోతోంది. 'ఎప్పుడూ ఒకేలా కన్పిస్తే బోర్‌ కొట్టేస్తుంది.. పెర్ఫామెన్స్‌తో నేనేంటో నిరూపించుకున్నాను కదా.. ఇప్పుడు మళ్ళీ గ్లామరస్‌గా కన్పించాల్సిన టైమొచ్చింది..' అంటూ తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

అన్నట్టు, వరుస సినిమాలతో బిజీగా వుండడంతో పర్సనల్‌ లైఫ్‌ని మిస్సయ్యానంటోన్న తాప్సీ, 'నామ్‌ షబానా' రిలీజ్‌ తర్వాత కొద్ది రోజులు ఎవరికీ కన్పించకుండా 'హాలీడేస్‌'ని ఎంజాయ్‌ చేస్తుందట. తిరిగొచ్చాక, 'జుద్వా-2' సినిమా షూటింగ్‌లో బిజీ అవుతానంటోంది తాప్సీ. అన్నట్టు, తాప్సీని అల్ట్రా గ్లామరస్‌గా టాలీవుడ్‌ ఎప్పుడో చూసేసింది. ఇదే విషయం ఆమె వద్ద ప్రస్తావిస్తే, 'అంతకు మించి.. అల్ట్రా మోడ్రన్‌గా కన్పిస్తా..' అంటూ నవ్వేసింది తాప్సీ.