Advertisement


Home > Movies - Movie News
వామ్మో.. రజనీకాంత్‌ మళ్ళీ ముంచేస్తేనో.!

'లింగా' సినిమా దెబ్బకొట్టేసింది.. అంతకు ముందు 'విక్రమసింహ' డిస్ట్రిబ్యూటర్లను ముంచేసింది.. 'కబాలి' సంగతి సరే సరి.! అయినాసరే, రజనీకాంత్‌ తాజా చిత్రం 'రోబో 2.0' సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయ్‌. తెలుగు రైట్స్‌కి షరామామూలుగానే రికార్డు స్థాయిలో 'ధర' పలికింది.! 

శంకర్‌ మ్యాజిక్‌ అనుకుందామా.? అంటే, శంకర్‌ - విక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఐ' సినిమా తేడా కొట్టేసిందాయె.! మరెలా.? రజనీకాంత్‌ - శంకర్‌ కాంబినేషన్‌పై వున్న క్రేజ్‌ అలాంటిది మరి. క్రేజ్‌ సంగతి సరేగానీ, ఫలితం తేడా కొట్టేస్తేనో.? ఇప్పుడు ఇదే అంశంపై తెలుగు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ '2.0' సినిమాలో విలన్‌గా నటించిన విషయం విదితమే. రజనీకాంత్‌ సరసన 'ఐ' ఫేం అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ చిత్రంలో. అత్యంత భారీ బడ్జెట్‌తో, దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరిలో '2.0' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన సినిమాలతో వరుసగా డిస్ట్రిబ్యూటర్లనీ, ఎగ్జిబిటర్లనీ ముంచేస్తోన్న రజనీకాంత్‌, '2.0' సినిమాతో అయినా ఉపశమనం కల్గిస్తాడా.? వేచి చూడాల్సిందే.