Advertisement


Home > Movies - Movie News
సంక్రాంతి నుంచి అజ్ఞాతవాసిలోకి వెంకీ

అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి ముందుగానే ప్లాన్-బిని సిద్ధంచేసి పెట్టుకున్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి వెంకీ పోర్షన్ ను లేపేసిన విషయం తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్ కావాలనే వెంకీ నటించిన సన్నివేశాల్ని తొలిగించినట్టు తెలుస్తోంది. ఒకవేళ సినిమా రిజల్ట్ తేడాకొడితే అప్పుడు వెంకీ నటించిన సీన్లు జతచేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్-బి.

ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. అజ్ఞాతవాసి సినిమా తేడా కొట్టింది. దీంతో వెంకీని వీలైనంత త్వరగా రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి నుంచి వెంకీ నటించిన సన్నివేశాల్ని అజ్ఞాతవాసికి జతచేస్తారట. కాకపోతే వెంకీ ఫస్టాఫ్ లో వస్తాడా, సెకండాఫ్ లో వస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

నిజానికి సినిమాలో బలమైన పాత్రల్లేవ్. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ పాత్రలకు సినిమాతో సంబంధం లేదు. సినిమాలో కీలకమైన విలన్ పాత్రను కూడా బలంగా చూపించలేకపోయారు. ఇలాంటి బలహీనమైన పాత్రల మధ్య "బలమైన పాత్ర"గా చెబుతున్న వెంకీ క్యారెక్టర్ ఏ మేరకు రాణిస్తుందనేది చూడాలి.

అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి వెంకీపై 4రోజులు షూట్ చేశారు. ఓ యాక్షన్ బ్లాక్ తో పాటు పవన్-వెంకీ మధ్య ఓ ఆసక్తికర సన్నివేశాన్ని కూడా తెరకెక్కించారు. తాజా సమాచారం ప్రకారం, వెంకీ నటించిన సన్నివేశాల్ని సెకెండాఫ్ లోనే చేరుస్తారని తెలుస్తోంది. కానీ వెంకీ కోసం సినిమా తొలి అర్థ భాగాన్ని భరించడం సహనానికి పరీక్ష.