Advertisement


Home > Movies - Movie News
వినాయక్.. చూపు రాజకీయాల వైపు..?

రాజకీయ నేతలతో కాసింత సన్నిహిత సంబంధాలనే నెరుపుతూ ఉంటాడు వీవీ వినాయక్. ఫలానా పార్టీ అని కాదు కానీ, వినాయక్ రాజకీయాలపై కాస్త మక్కువను చూపిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ దర్శకుడు చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాజకీయ ప్రవేశం గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నపై వినాయక్ స్పందిస్తూ.. ‘దేవుడు ఆదేశిస్తే..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

మరి ఉన్న ఫలంగా వినాయక్ ను రాజకీయాల గురించి ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, సొంత ప్రాంతంలో ఒక పంచాయితీ సర్పంచ్ మరణిస్తే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాడు వినాయక్. ఈ నేపథ్యంలో రాజకీయాల ప్రస్తావన వచ్చింది. రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ దేవుడు ఆదేశిస్తే తను రాజకీయాల్లోకి వస్తానేమో.. అని అన్నాడు.

అంతే కాదు.. తను దర్శకుడిని అవుతానని అస్సలు ఊహించ లేదు అని, అంతా అలా జరిగిపోయిందని, రాజకీయాల విషయంలో కూడా దేవుడు ఆదేశిస్తే జరిగిపోతుందేమో... అన్నట్టుగా వినాయక్ మాట్లాడటం గమనార్హం. మరి సినిమా వాళ్లకు ఇది రాజకీయాలకు అనుగుణమైన సీజన్ లాగా ఉంది. ఇదే ఊపులో వినాయక్ కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్నికల నాటికి ఈ సినిమా వాళ్లంతా కలిసి పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతారేమో!