Advertisement


Home > Movies - Movie News
'విరుష్క' పెళ్ళిపై ఖండన వచ్చేసిందోచ్‌

క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ఎప్పటినుంచో ప్రేమలో వున్నారు. మధ్యలో ఆ ప్రేమ కాస్త 'వికటించి'నప్పటికీ, మళ్ళీ నెమ్మదిగా వికసించేసింది. 'నువ్వు లేక నేను లేను' అనేంతలా ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియా వేదికగా తమ 'ప్రేమ'ని చాటుకుంటూ, అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇస్తున్నారు విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ. ఈ 'విరుష్క' జోడీ పెళ్ళి గురించిన గాసిప్స్‌ గత కొంతకాలంగా 'గట్టిగా' విన్పిస్తున్న విషయం విదితమే. 

డిసెంబర్‌ 11 - 13 మధ్య విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్ళి చేసుకోబోతున్నారనీ, ఇప్పటికే అత్యంత సన్నిహితులకు సమాచారం అందిందనీ తాజాగా బాలీవుడ్‌ మీడియా కోడై కూసేసింది. క్షణాల్లో ఈ వార్త వైరల్‌గా మారిపోయింది. దాంతో, అనుష్క శర్మ తరఫున ఈ గాసిప్స్‌ని ఖండిస్తూ ఓ ప్రకటన బయటకొచ్చింది. 'ప్రస్తుతం అనుష్క పెళ్ళి ఆలోచనలేమీ జరగడంలేదు..' అని తేల్చేసింది ఆ ప్రకటన. 

అనుష్క, విరాట్‌ కోహ్లీ.. ఈ ఇద్దరి మధ్యా ప్రేమ నిజం.. పెళ్ళి చేసుకోబోతున్నారా.? లేదా.? అన్నదానిపై మాత్రం క్లారిటీ రావడంలేదు. ఇంకెన్నాళ్ళు ఈ జంట 'ప్రేమ'ని ఎంజాయ్‌ చేస్తుందో ఏమో.!