Home > Movies - Movie News
ఆ విషయం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం

చాన్నాళ్ల తర్వాత కోలీవుడ్ లో ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అదే అరమ్ సినిమా. ఈ మూవీ సక్సెస్ తో పండగ చేసుకుంటోంది నయనతార. వ్యక్తిగత విషయాలు, ఎఫైర్ల గురించి అడిగినప్పుడు గతంలో సీరియస్ అయ్యేది ఈ భామ. కానీ ఇప్పుడు సినిమా సక్సెస్ తో కాస్త మెత్తబడింది. విషయం బయటపెట్టకపోయినా సున్నితంగా తిరస్కరిస్తోంది.

ప్రస్తుతం డైరక్టర్ విఘ్నేష్, నయనతార చాలా క్లోజ్ గా ఉంటున్నారు. డైరక్ట్ గా నయన్ ఇంటికే వెళ్తున్నాడు విఘ్నేష్. ఈమధ్యే ఇతగాడి పుట్టినరోజును తన సొంత ఖర్చుతో అమెరికాలో సెలబ్రేట్ చేసింది నయన్. అరమ్ సక్సెస్ టూర్ సందర్భంగా ఇదే విషయాన్ని ప్రస్తావించింది మీడియా.

ఈసారి మాత్రం నయనతార సీరియస్ అవ్వలేదు. వ్యక్తిగత విషయాల్ని పబ్లిక్ లో మాట్లాడను. ఆ విషయాన్ని మనం ప్రైవేటు గా మాట్లాడుకుందామంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం చెబుతున్నప్పుడు కూడా ఆమె నవ్వుతూనే కనిపించింది.

ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది నయనతార. అత్యథిక రెమ్యూనరేషన్ తీసుకుంటోంది కూడా. 2019లో విఘ్నేష్ ను ఆమె పెళ్లాడతుందంటూ వార్తలు వస్తున్నాయి.