Advertisement


Home > Movies - Movie News
అజ్ఞాతవాసిని వెంకీ ఆదుకుంటాడా?

అజ్ఞాతవాసి సినిమా నుంచి వెంకీ పోర్షన్ ను తొలిగించిన విషయం తెలిసిందే. అలా కట్ చేసిన సన్నివేశాల్ని సంక్రాంతి నుంచి యాడ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఓ చిన్న ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఇప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను వెంకీ ఏ మేరకు ఆదుకుంటాడనేది ఆలోచించాల్సిన విషయం.

వెంకటేశ్, పవన్ కలిసి డబ్బింగ్ చెబుతున్న విజువల్స్ ను ప్రోమోగా విడుదల చేశారు. గురువు గారు.. గురువుగారు అని వెంకీని పిలుస్తాడు పవన్. గారు అక్కర్లేదు.. గురు అని పిలిస్తే చాలంటాడు వెంకీ. నాకు కొంచెం తిక్కుందని పవన్ అంటాడు.. దానికో లెక్కుందని వెంకీ అంటాడు.. ఇలా సాగింది తాజా అజ్ఞాతవాసి ట్రయిలర్.

అజ్ఞాతవాసికి ఆల్రెడీ ఫ్లాప్ టాక్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇలాంటి టైమ్ లో వెంకటేష్ నటించిన సన్నివేశాల్ని యాడ్ చేస్తున్నారు మేకర్స్. ఈ కొత్త నిర్ణయం మూవీకి ఏ మేరకు హెల్ప్ అవుతుందనేది చూడాలి.

మరోవైపు సినిమా ఫస్టాఫ్ నుంచి కొన్ని సన్నివేశాల్ని తొలిగిస్తే బాగుంటుందనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బోర్ కొట్టించే సన్నివేశాలు ఎక్కువగా ఫస్టాఫ్ లోనే ఉన్నాయి. వాటిని తీసేసి, వెంకీ ఎపిసోడ్ ను యాడ్ చేస్తే కాస్తయినా ఫలితం ఉండొచ్చంటున్నారు. మరి ఈసారి త్రివిక్రమ్ దగ్గర ప్లాన్-బి ఉందేమో చూడాలి.