Advertisement


Home > Movies - Movie News
అవును.. నా సినిమా అట్టర్ ఫ్లాప్

జూలీ-2 సినిమాపై ఎన్నో ఆశలుపెట్టుకుంది రాయ్ లక్ష్మి. కెరీర్ లో ఆమెకిది 50వ చిత్రం కావడంతో పాటు బాలీవుడ్ డెబ్యూ మూవీ కూడా. అందుకే జూలీ-2తో ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంది. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా తెరపై అందాలు ఆరబోసింది. అయినప్పటికీ జూలీ-2అట్టర్ ఫ్లాప్ అయింది. దర్శకుడు దీపక్ తో పాటు హీరోయిన్ రాయ్ లక్ష్మీ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.

"అవును.. మా సినిమా ఫ్లాప్ అయింది. ఇదొక సెక్స్ సినిమాలా ఉంటుందని ప్రేక్షకులు ఆశించారు. ప్రమోషన్ కూడా అదే యాంగిల్ లో జరిగింది. టీజర్ మొత్తం ఎరోటిక్ గా ఉంటుంది. కానీ ఇందులో సెక్స్ లేదు. దీనికి తోడు విమర్శకులు కూడా మా సినిమాపై విరుచుకుపడ్డారు. ఇదంతా నాకొక మంచి ఎక్స్ పీరియన్స్." రాయ్ లక్ష్మీ రియాక్షన్ ఇది. 

తన కెరీర్ పై జూలీ-2ఫ్లాప్ ప్రభావం పడదంటోంది రాయ్ లక్ష్మీ. కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ సహజమని... మనసుకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తానని అంటోంది. ఓ నెల రోజులు రెస్ట్ తీసుకొని వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త సినిమా ప్రారంభిస్తానంటోంది.

మళ్లీ మరోసారి హిందీలో నటిస్తారా అనే ప్రశ్నకు మాత్రం రాయ్ లక్ష్మి సమాధానం ఇవ్వలేదు. చూద్దామంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మొత్తమ్మీద బాలీవుడ్ లో మరో సౌత్ హీరోయిన్ ఫ్లాప్ అయింది. హిందీలో క్లిక్ అయిన సౌత్ భామల కంటే ఫ్లాప్ అయిన హీరోయిన్లే ఎక్కువమంది. ఇప్పుడా లిస్ట్ లోకి రాయ్ లక్ష్మి కూడా చేరిపోయింది.