Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

జాన్వీ కపూర్.. ఫస్ట్ పోటో షూట్!

జాన్వీ కపూర్.. ఫస్ట్ పోటో షూట్!

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సినీ ఆరంగేట్రానికి సర్వం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న ఈ ప్రతిపాదన పట్ల కపూర్ ల కుటుంబం గుంభనంగా ఉంది. అయితే శ్రీదేవి తన పెద్ద కూతురును హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసేందుకు సానుకూలంగా ఉందని, అందుకు ఆమెను తీర్చి దిద్దుతోందని ఈ మధ్య కాలంలో వార్తలు ఊపందుకున్నాయి.

నటనా నైపుణ్యాలను, నృత్యాన్ని నేర్పిస్తోందనే మాట వినిపించింది. దానికి తోడు ఇప్పుడు జాన్వీ ఫోటో షూట్ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. హీరోయిన్ ఆరంగేట్రానికి ముందు జాన్వీ ఫస్ట్ ఫొటో షూట్ ఇప్పటికే పూర్తి అయ్యిందని సమాచారం. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ విషయం గురించి వాకబు చేస్తే.. జాన్వీ ఒక బాలీవుడ్ సినిమా ద్వారానే ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. ‘సైరత్’ అనే మరాఠీ సినిమా హిందీ రీమేక్ లో ఇషాన్ కట్టర్ సరసన జాన్వీ హీరోయిన్ గా నటించనుందట. మొత్తానికి జాన్వీ కపూర్ తెరంగేట్రానికి సమయం దగ్గరపడుతోందేమో! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?