Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

పిచ్చెక్కిస్తున్న బన్నీ భామ

పిచ్చెక్కిస్తున్న బన్నీ భామ

దువ్వాడ జగన్నాధమ్ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే... ఆ సినిమా విడుదల కాకముందే దుమ్మురేపుతోంది. డీజే టీజర్ లో కనిపించీ కనిపించనట్టు కూసింత అందాల్ని చూపించారు.

సినిమా రిలీజ్ అయ్యాక పూజా అందాలు ఫుల్ లెంగ్త్ లో సిల్వర్ స్క్రీన్ పై చూడొచ్చంటూ ఊరించారు. అయితే అంతకంటే ముందే పూజా హెగ్డే అందాల విందు అందిస్తోంది. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అనే రేంజ్ లో సెక్సీ లెగ్స్ ను కవర్ పేజ్ పై  చూపిస్తోంది.

మ్యాగ్జిమ్ మార్చి నెల సంచిక కవర్ పేజ్ పై బన్నీ బ్యూటీ ప్రత్యక్షమైంది. “హాట్ నెస్ అంటే ఇది” అంటూ కుర్ర హృదయాల్ని ఉర్రూతలూగిస్తోంది. కవర్ పైనే కాదు, లోపల కూడా మరిన్ని అందాలు దాగున్నాయని చెబుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ స్టిల్ చూసి రసిక హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు ఈ ఫొటోను పిన్ చేస్తూ, ఓ  సెక్సీ ట్వీట్ కూడా చేసింది పూజా హెగ్డే. కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్వేజ్ సెక్సీ అంటూ పూజా చేసిన ట్వీట్.. ఫొటో కంటే హాట్ గా మారింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?