Home > Movies - Photo Feature
నల్లకలువ.. నగ్న పోజు..!

నల్లగా ఉన్న వారంటే ప్రపంచానికి కొంత చిన్న చూపు.. అందంగా ఉండరని.. మరి అందం అంటే ఆత్మవిశ్వాసం తప్ప మరేం కాదు... అనే థియరీకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ లో ఒకరు సెరీనా విలియమ్స్.

టెన్నిస్ కోర్టు ఆవల, మోడలింగ్ వరల్డ్ ను ప్రభావితం చేస్తూ గ్లామర్ కే గర్వకారణంగా నిలుస్తోందీమె. ఈ క్రమంలో తాజాగా వ్యానిటీఫైర్ పత్రిక కోసం సెరీనా ఈ పోజునిచ్చింది. రెడిఫ్ కో ఫౌండర్ అయిన అలెక్సిస్ ఒల్హానియన్ తో కొన్నాళ్లుగా ప్రేమలో, సహజీవనంలో ఉంది సెరీనా.

ఈ క్రమంలో ఈమె గర్భవతి అయ్యింది. బేబీ బంప్ తో సెలబ్రిటీల న్యూడ్ పోజులకు ఈ మధ్య బాగా క్రేజ్ ఉంది కదా.. అందుకే సెరీనా ఇలా దర్శనమిస్తోంది. ఈ పోజుకు గానూ మిలియన్ల కొద్దీ డాలర్లను పారితోషకంగా తీసుకుందట ఈ టెన్నిస్ స్టార్.