Home > Movies - Photo Feature
హాట్ బ్యూటీ... వైల్డ్ టాప్‌లెస్..!

ఇండియన్ తెర మీద చమక్ మంటున్న శ్రీలంకన్ తార జెక్వెలిన్ మరోసారి హెడ్ లైన్స్ కు ఎక్కింది. టాప్ లెస్ పోజును ఇచ్చి ఈమె అదరగొట్టేసింది. ఈ మేరకు జాక్వెలిన్ తన హాట్ ఫొటో షూట్ ను ఇన్‌స్టాగ్రమ్ లో పోస్టు చేసింది.

తన ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మధ్య జాక్వెలిన్ కు అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రకమైన పోజుతో అందరి అటెన్షన్ ను పొందటానికి జాక్వెలిన్ ప్రయత్నాలు చేసినట్టుగా ఉంది.

ఇక టాప్ లెస్ పోజును ఇచ్చినట్టుగానే ఇచ్చి, అదే సమయంలో వీలైనంతగా అందాలను కవర్ చేసుకొంటూ చాలా తెలివైన స్టిల్లే ఇచ్చింది ఈ శ్రీలంకన్ సుందరి.

అయితే హాట్ ఎక్స్ ప్రెషన్ ను ఇచ్చి, ఇన్ స్టాగ్రమ్ లో ‘వైల్డ్’ అనే పదాలను ఉపయోగించి తన ఫొటోకు మరింత మసాలను అద్దింది. లేకపోతే పేరుకు టాప్‌లెస్ అని జుట్టు విరబోసుకునే టెక్నిక్ రివర్స్ తన్నేదేనేమో!