Home > Movies - Press Releases
9న " సువర్ణ సుందరి" టీజర్

గత కొంత కాలంగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల నిర్మాణం సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలొ కాస్త ఎక్కువగానే కన్పిస్తొంది. స్టార్ హీరో హీరోయిన్ లు కూడా రోటీన్ కి భిన్నంగా, తమ క్యారక్టరైజేషన్ కంటే  కధ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పైగా చారిత్రాత్మక సినిమాలు అంటే కాస్త ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఈ కోవలోనే "సువర్ణ సుందరి " తెరకెక్కుతోంది. "చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతుంది" అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. అలనాటి అందాల హీరొయిన్ జయప్రద  పూర్ణ,  సాక్షి చౌదరి, రామ్,ఇంద్ర  సాయికుమార్ ప్రధాన పాత్రల్లొ  ఈ హిస్టారికల్ అడ్వెంచర్ తెరకెక్కుతోంది.  

కేవలం కధ, కధనాలు నచ్చి  ఈ సినిమాను చెసెందుకు ఇంట్రెస్ట్ చూపటంతో పాటు, డూప్ లేకుండా స్టంట్స్ ను చెసి జయప్రద సినిమా పై తన ప్యాషన్ ను మరొసారి అందరికి గుర్తుచేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లొ విజువల్ వండర్ గా వస్తొన్న సువర్ణ సుందరి టీజర్ నవంబర్ 9నే  విడుదల కానుంది.

పూర్ణ, జయప్రద,  సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి.