Home > Movies - Press Releases
అమెరికాలో కేశవ సాంగ్ లాంచ్

కేశవ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ సాంగ్ లాంచ్ చేసారు. అయితే అది డైరక్ట్ గా ఆన్ లైన్ లోకి వదిలారు. రెండో పాటను అమెరికాలో విడుదల చేయబోతున్నారు.  హీరో నిఖిల్ ప్రస్తుతం అమెరికాలో వున్నారు. అక్కడి న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠంలో ఈ పాటను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో అక్కడి స్థానిక అధికార, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా అమెరికాలో మంచి వసూళ్లు సాధించింది. దాంతో కేశవ కొన్న ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్లు, ఈ సినిమాకు అక్కడ కాస్త మంచి పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పాటను లాంచ్ చేసే కార్యక్రమం పెట్టారు. ఇదిలా వుంటే కేశవ అడియో ఫంక్షన్ ఈనెల 13 సాయంత్రం జరుగుతుంది. నిఖిల్-రీతూవర్మ జంటగా నటించిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు.