Advertisement


Home > Movies - Press Releases
ఏంజెల్ ఫన్ ఎంటర్ టైనర్-కృష్ణారెడ్డి

సిందూరపువ్వు సినిమాతో నిర్మాత, దర్శకుడు కృష్ణారెడ్డి తనకు ఓ ట్యాగ్ లైన్ ఏర్పాటుచేసుకున్నారు. కొడుకు నాగ్ అన్వేష్ ను హీరోగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రామయ్య వస్తావయ్యా సినిమాతో ట్రయ్ చేసి, కాస్త గ్యాప్ ఇచ్చి రెండో సినిమాగా ఏంజెల్ సినిమా అందిస్తున్నారు. డైరక్టర్ గా పళని వున్నా కూడా అన్నీ తానై చూసుకున్న నిర్మాత కృష్ణారెడ్డి ఏంజెల్ విడుదల సందర్భంగా ముచ్చటించారు.

నాగ్ అన్వేష్ సినిమాతో హీరోగా, నటుడిగా ప్రూవ్ చేసుకంటాడని కృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ఇది సోషియో ఫాంటసీ జోనర్ కావడం వల్ల తమకు మంచి మార్కెట్ వచ్చిందన్నారు. హిందీ డిజిటల్ కోటిన్నర మినిమమ్ గ్యారంటీకి ఇచ్చామని, కనీసం అక్కడి నుంచి మరో యాభై లక్షలు వస్తుందని, ఆంధ్ర, సీడెడ్ ఇలా అమ్మిన ప్రతి ఒక్కరికి సినిమా చూపించి అమ్మామని ఆయన వివరించారు. సినిమా చూపించి, వాళ్లకు ఆలోంచుకునే టైమ్ ఇచ్చాక, వాళ్లంతట వాళ్లు వచ్చి అడ్వాన్స్ లు ఇచ్చారన్నారు. 

సినిమా మేకింగ్ లో ఎక్కడా రాజీ పడలేదని, క్వాలిటీ కోసం ఖర్చు చేసామని, అయితే అదే సమయంలో కొత్తగా సినిమా ప్రారంభంలోనే సింగిల్ పేమెంట్ అది కూడా అడ్వాన్స్ గా ఇవ్వడం అనే పద్దతి ఆచరించి, ఖర్చు పొదుపు చేసామని, మరే నిర్మాత అయినా ఈ సినిమాకు కనీసం మరో నాలుగు కోట్లు అదనంగా అవుతుందని తెలిపారు.

ఈ సినిమా తరువాత బయట బ్యానర్లలో నాగ్ అన్వేష్ సినిమా చేసే అవకాశం వుందని, రెండు మాంచి సబ్జెక్ట్ లు రెడీగా వున్నాయని వెల్లడించారు. హెబ్బా పటేల్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించనంత అందంగా ఈ సినిమాలో కనిపిస్తుందన్నారు. 

సినిమా మీద మంచి హోప్ తో వున్నామని, ప్రేక్షకులు పాజిటివ్ జడ్జిమెంట్ ఇస్తారని ఆశిస్తున్నానని, కృష్ణా రెడ్డి అన్నారు.