Home > Movies - Press Releases
అయితే టీజర్ ఓకె..

సీనియర్ వంశీ నుంచి మంచి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. నిజానికి ఏ ముహుర్తాన రైటర్ తనికెళ్ల ఏక్టర్ అయిపోయి, వంశీ సినిమాలకు సరైన రైటర్ లేకుండా అయిపోయిందో? అప్పటి నుంచి ఆయన సినిమాలు దాదాపుగా అన్నీ బకెట్ తన్నేసాయి. అయితే ఇఫ్పుడు మళ్లీ ఇన్నాళ్లకు అదే తనికెళ్ల భరణి ఎప్పటి నుంచో ఆలోచించి పెట్టిన లేడీస్ టైలర్ సీక్వెల్ ను ఇప్పుడు వంశీ తలకెత్తుకున్నారు. 

ఈ సినిమా పాటలు ఇటీవల ఒక్కొక్కటిగా ఆన్ లైన్ లో విడుదల చేసారు. ఒకటి రెండు పాటలు మళ్లీ వంశీ స్టయిల్ ను గుర్తుకు తెచ్చాయి. మిగిలినవి నలగడానికి కాస్త టైమ్ పట్టేలా వున్నాయి. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ టీజర్ వచ్చింది. 

టైలర్ సుందరం(రాజేంద్ర ప్రసాద్), సుజాత టీచర్ (అర్చన) ల కొడుకు గోపాలం గా ఫ్యాషన్ డిజైనర్ వచ్చాడు. లేడీస్ టైలర్ కాస్తా ఫ్యాషన్ డిజైనర్ అయినట్లుగా, జమజచ్చ కాస్తా మన్మధరేఖ అయింది. టీజర్ వరకు వంశీ టేకింగూ బాగానే వుంది. టైలాగులు బాగానే పేలాయి. సుమంత్ అశ్విన్ తన మాడ్యులేషన్ మార్చి కాస్త కొత్తగా ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద టీజర్ ఓకె . చూడాలి మరి ఈ లేడీస్ టైలర్ సీక్వెల్ కమ్ అప్ డేట్ వెర్షన్ ఎలా వుంటుందో?