Advertisement


Home > Movies - Press Releases
బృందావనమది అందరిదీ టీమ్ ఇదే

రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారి బృందావనమది అందరిదీ అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కొందరు కొత్త నటులను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. వారందరి ఎంపిక పూర్తయిన సందర్భంగా సినిమా కాస్టింగ్ వివరాలను యూనిట్ ప్రకటించింది.

హీరోగా సిద్దూ (గుంటూరు టాకీస్), హీరోయిన్ గా సీరత్ కపూర్ నటిస్తారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు మాస్టర్ విక్రమ్ ఓ కీలకపాత్ర పోషిస్తాడు. శ్రీధర్ సీపాన రైటర్ గా అనే మాంచి పాత్రలు కమెడియన్ పృధ్వీ కోసం తయారు చేసారు. అందుకే మళ్లీ తన డైరక్షన్ సినిమాలో ఓ మాంచి పాత్రను పృధ్వీ కోసం తయారుచేసారు.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా తరువాతి షెడ్యూలు సంక్రాంతి తరువాతి నుంచి వుంటుంది. శ్రీనివాస్ వంగల నిర్మాత. సీపాన శ్రీధర్ దర్శకుడు.