Home > Movies - Press Releases
చిన్న సినిమాకు పెద్ద అండ

వారాహి పిక్చర్స్ సాయి కొర్రపాటి సిసలైన సినిమా అభిమాని. మంచి సినిమా అని ఆయనకు అనిపిస్తే చాలు, టక్కున పట్టేసుకుంటారు. ఈ క్రమంలో కాస్త చేతులు కాలినా పట్టించుకోరు.

గతంలో ఇలా కొన్ని సినిమాలకు తన సపోర్టు అందించారు. కొన్నింటిలో లాభం చూసారు. మరి కొన్నింటిలో నష్టం చూసారు. అయినా కూడా ఆ పని మాత్రం మానరు.

ఇటీవల బాహుబలి 2 తో తన బ్యాలెన్స్ షీట్ లెవెల్ చేసుకుని హ్యాపీగా వున్న సాయి కొర్రపాటి మళ్లీ మరో చిన్న సినిమాను మార్కెట్ చేసే పని పెట్టుకున్నారు. ప్రదీప్ చంద్ర, మోహన్ అనే నిర్మాతలు నిర్మించిన రెండు రెళ్లు ఆరు అనే చిన్న సినిమాను ఈ నెలలో విడుదల చేయబోతున్నారు.

అనిల్, మహిమ అనే కొత్త నటులు నటించిన ఈ సినిమాను నందు మల్లెల అనే కొత్త దర్శకుడు రూపొందించారు. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేసారు. మాంచి ఫ్యామిలీ ప్లస్ లవ్ స్టోరీ అన్న ఫీల్ అయితే కలిగించింది టీజర్. అసలు కథ అంతా సినిమాలో కదా వుండేది. వెయిట్ అండ్ సీ.