Advertisement


Home > Movies - Press Releases
డిఫరెంట్ సినిమా

సీనియర్ కథానాయిక రాశి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `లంక`. రోలింగ్‌రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నామన దినేష్, నామన విష్ణు కుమార్ నిర్మిస్తున్నారు. శ్రీముని దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఏప్రిల్ 21న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా అందాల రాశి కాసేపు పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

హీరోయిన్ గా 75 సినిమాల్లో న‌టించాను. అవ‌న్నీ ఒకే జోన‌ర్ కు చెందిన పాత్రలు. కానీ `లంక` ఓ డిఫ‌రెంట్ మూవీ. ఇందులో కాంట్రాక్ట్ లుక్ లో క‌నిపిస్తా. ఆహార్యం..న‌ట‌న అన్నీ కొత్త‌గా ఉంటాయి.  40 ఏళ్ల వ‌య‌సుగ‌ల  ఓ పెద్దావిడ సోలోగా లైఫ్ లీడ్ చేస్తుంటుంది. ఆ క్ర‌మంలో ఆమెకు హీరోయిన్ ప‌రిచ‌యం అవుతుంది. ఆ అమ్మాయిని నేను ఆవ‌హించానా?  లేక త‌ను  న‌న్ను ఆవ‌హించిందా? అన్న‌ది స‌స్సెన్స్.  మొత్తం ఆరు పాత్ర‌ల చుట్టూ క‌థ తిరుగుతుంది. ఆడ‌వాళ్ల‌కు భ‌ద్ర‌త లేద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. స‌మాజంలో ఆడ‌వాళ్లు ఉన్నా అదోక `లంక‌`గా భావించి బ్ర‌తుకుతున్నాం. ఆ కాన్సెప్ట్ ను బేస్ చేసుకునే క‌థ సిద్ద‌మైంది. నా పాత్ర‌లో ఎలాంటి మేక‌ప్ లేకుండా నేచుర‌ల్ ఫేస్ తోనే న‌టించా. నా క‌ర్లీ హెయిర్ కూడా కొత్త లుక్ ను తీసుకొచ్చింది.

హీరోయిన్ గా ఉన్న‌ప్పుడు పాత్ర‌లో విష‌యంలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ ఈ వ‌య‌సులో నేను ప్ర‌త్యేకంగా చేయాల్సింది ఏమి లేదు. కాక‌పోతే ఎంచుకునే పాత్ర‌లో ఇంపార్టెన్స్ ఉండాలి. త‌ల్లి..అక్క పాత్ర‌లు చేయ‌డానికి సిద్దంగా ఉన్నా. సెకెండ్ ఇన్నింగ్స్ లో కేరింగ్ లేవీ ఉండ‌వు . చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే.

ఇప్పుడు టెక్నాలజీతో పాటు హీరోయిన్ల‌కు క‌ల్పించే ఫెసిలిటీస్ బాగున్నాయి. అప్ప‌ట్లో  కార్వాన్స్ లేవు. చెట్టు క్రింద ఫ్యాన్లు..కూల‌ర్లు పెట్టుకుని విశ్రాంతి తీసుకునే వాళ్లం. ఒక సినిమా పారితోషికం ఇప్పుడు ఒక రోజులో హీరోయిన్ కు వ‌చ్చేస్తుంది. ఇప్పుడున్న ఫేంలో ఉన్న హీరోయిన్లంద‌రిదీ హ్యాపీ లైఫ్. రియాల్టీ షోలు చేయడానికి సిద్దంగానే ఉన్నా. కాక‌పోతే వాటిపై పెద్ద‌గా నాలెడ్జ్ లేదు. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా. ప్ర‌స్తుతం ఏ సినిమాలు చేయ‌లేదు. లంక రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు రాశి