Advertisement


Home > Movies - Press Releases
డైరక్టర్ గా సాయి శ్రీరామ్

మరో సినిమాటోగ్రాఫర్ డైరక్టర్ గా మారుతున్నారు. పిల్లజమీందార్, గీతాంజలి, సుప్రీమ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమమ్, నిన్నుకోరి, ఎక్స్ ప్రెస్ రాజా, సూర్య వెర్సస్ సూర్య వంటి విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సాయి శ్రీరామ్ ఇప్పుడు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లోకి అడుగు పెడుతున్నారు. డైరక్టర్ కావాలనే కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చి, సినిమాటోగ్రాఫర్ గా మారారు.

మొత్తం మీద సాయి శ్రీరామ్ సక్సెస్ ఫుల్ సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పడు మాంచి స్క్రిప్ట్ తో డైరక్టర్ గా మారుతున్నారు. 

మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై తొలి సినిమాచేయబోతున్నారు. అర్జున్ రెడ్డి, అందాల రాక్షసి సినిమాలకు సంగీతం అందించిన రాధాన్ సంగీత దర్శకుడు. స్టార్ కాస్ట్ ఎంపిక పనిలో వున్నారు. యుంగ్ హీరో నాగ శౌర్యను హీరోగా ఎంపిక చేసారు. ఇప్పటికే రెండు సినిమాలు చేస్తూ, సుకుమార్ బ్యానర్ లో మరో సినిమాకు సైన్ చేసిన నాగశౌర్యకు ఇది లైన్ లో నాలుగో సినిమా అవుతుంది.