Advertisement


Home > Movies - Press Releases
జె.ఎల్‌.ఇ.సినిమాస్ ప్రారంభం

గుంటూరు ప‌ట్టణంలో అధునాత‌న సౌక‌ర్యాల‌తో నిర్మించిన జె.ఎల్‌.ఇ. సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను శుక్ర‌వారం ప్రారంభించారు. అధునాత‌మైన సౌండింగ్ టెక్నాల‌జీని ప్రేక్ష‌కుల‌కు అందించే టెక్నాల‌జీతో రాము పొలిశెట్టి ఈ మ‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్‌ను నిర్మించారు.

ఇండియ‌న్ సినిమా ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచానికి చాటిన బాహుబ‌లి-2 సినిమాను ఈ జె.ఎల్‌.ఇ. సినిమాస్‌లో తొలిసారిగా ప్ర‌ద‌ర్శించారు. వారాంత‌పు రోజులు కావ‌డంతో ప్రేక్ష‌కులతో థియేటర్ నిండిపోయింది. అంతే కాకుండా ప్రేక్ష‌కులు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇంకా ప్ర‌ముఖ నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)తో పాటు టీడీపీ ఎమ్మెల్యే మొదుగుల వేణుగోపాల్ పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ ``గుంటూరు ప‌ట్టణంలో ఇంత టాప్ స్టాండ‌ర్డ్‌లో థియేట‌ర్ నిర్మించ‌డం ఆనందంగా ఉంది. డ‌బ్బు అంద‌రి ద‌గ్గ‌ర ఉంటుంది. కానీ టేస్ట్ కొంద‌రి ద‌గ్గ‌ర మాత్ర‌మే ఉంటుంది. ఇంత పెద్ద మ‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్‌ను క‌ట్టిన రాము పొలిశెట్టిగారిని ఈ సంద‌ర్భంగా అభినందిస్తున్నాను`` అని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే బెస్ట్ థియేట‌ర్ అని కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిథులు రాము పొలిశెట్టిని అభినందించారు.

కొన్ని ఎకరాల స్థలంలో ఇప్పటి వరకు ఆంధ్రలో లేనంత ఖరీదైన ఇంటీరియర్ తో, అద్భుతమైన సౌండ్ సిస్టమ్ తో ఈ ఆరు స్క్రీన్ ల మల్టీ ఫ్లెక్స్ ను నిర్మించడం విశేషం.