Home > Movies - Press Releases
జూలై 7న ఏజెంట్ భైరవ

పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై విజయ్‌, కీర్తి సురేష్‌, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్‌ భైరవ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'తమిళ్‌స్టార్‌ హీరో, ఇళయదళపతి విజయ్‌ విజయ్‌ నటించిన 'ఏజంట్‌ భైరవ' ట్రైలర్‌ని రీసెంట్‌గా విడుదల చేసాము. ప్రేక్షకుల నుండి ఈ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంతో మా హీరో విజయ్‌కి తెలుగులో మంచి హిట్‌ని అందుకుంటాడని, అలాగే మా బ్యానర్‌ మంచి హిట్‌ వస్తుందని ఆశిస్తున్నాము. జూలై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..

విజయ్‌, కీర్తిసురేష్‌, జగపతిబాబు, సతీష్‌, వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్‌ బాలాజీ, ఆపర్ణ వినోద్‌, పాప్రీ గోష్‌, హరిష్‌ ఉత్తమున్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, కెమెరా: ఎమ్‌. సుకుమార్‌, ఫైట్స్‌: అనల్‌ అరసు, ఆర్ట్‌: ఎమ్‌. ప్రభాకరన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌. కె. ఎల్‌, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ-దర్శకత్వం: భరతన్‌.