Advertisement


Home > Movies - Press Releases
కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌` గుమ్మ‌డికాయ వేడుక‌

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`.ఈ సినిమా మార్చి 3న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్ రామా నాయుడు స్టూడియోలో గుమ్మ‌డికాయ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా

మాటల రచయిత సాయిమాధ‌వ్ బుర్రా మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు వంశీకృష్ణతో దొంగాట చిత్రానికి ప‌నిచేశాను. ఇప్పుడు మా కాంబినేష‌న్‌లో ఇది రెండో సినిమా. ప్రతి సీన్ విభిన్నంగా ఉంటుంది. ప్ర‌తి డైలాగ్ కొత్త‌గా ఉండాల‌ని ప్ర‌య‌త్నించాను`` అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ  పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వంశీకృష్ణ చూడటానికి క్లాస్‌గా క‌న‌ప‌డ‌తాడు కానీ, చాలా మాస్ డైరెక్ట‌ర్‌. రాజ్ త‌రుణ్ ఓ సాంగ్ రాయ‌డం విశేషం. ఈ సినిమా మంచి ఎంట‌ర్‌టైన‌ర్ అవుతుంది`` అన్నారు. అను ఇమ్మాన్యుయ‌ల్ మాట్లాడుతూ రాజ్ త‌రుణ్ చాలా హ్య‌పీగా ఉండే హీరో. త‌న‌తో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది అన్నారు. 

ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ  ఈ సినిమా ఎనిమిది నెల‌ల ప్ర‌యాణం. ఈ ప్ర‌యాణంలో ఒక మంచి టీంతో క‌లిసి ట్రావెల్ చేయ‌డాన్ని మ‌ర‌చిపోలేను. ఈ సినిమా నాకు రెండో సినిమా. అంద‌రం డిస్క‌స్ చేసి ఒక క్లారిటీతో సినిమా చేశాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. 
నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ ఈ సినిమాలో లాజిక్‌లు క‌న‌ప‌డ‌వు కానీ మ్యాజిక్ ఉంటుంది. ప్రేక్ష‌కులు న‌వ్వుతూనే ఉంటారు. ప్ర‌తి సీన్ కొత్త‌గా ఉంటుంది. అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అను ఇమ్మాన్యుయ‌ల్‌కు నెక్ట్స్ రేంజ్ మూవీ అవుతుంది. ఈడో ర‌కం ఆడోర‌కం త‌ర్వాత రాజ్ త‌రుణ్‌తో చేసిన సినిమా. ఎంతో బాగా స‌పోర్ట్ చేశారు. స్క్రిప్ట్ ప‌రంగా స‌పోర్ట్ చేయ‌డ‌మే కాకుండా, ఈ సినిమా కోసం పాట రాశాడు. పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా చాలా డిఫ‌రెంట్‌గా క‌న‌ప‌డ‌తాడు.  అంద‌రికీ థాంక్స్‌ అన్నారు. 

హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ - ``ఒక సంవ‌త్స‌రం ముందు విన్న క‌థ ఇది. విన‌గానే సినిమా చేస్తాన‌ని అనుకున్నాం. చాలా కాంప్లెక్స్ స్క్రిప్ట్‌. దాన్ని చ‌క్క‌గా ప్రెజెంట్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు ఎవ‌రా అని ఆలోచిస్తే అనీల్ గారు వంశీకృష్ణ‌న‌ను తీసుకొచ్చారు. రాజ‌శేఖ‌ర్‌గారు ప్ర‌తి సీన్‌ను ఎంతో గ్రాండ్‌గా చూపించారు. అనూప్ రూబెన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. త‌న‌తో ఎప్ప‌టి నుండో క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటున్నాను. ఈ సినిమాకు కుదిరింది.   ఫ‌స్ట్ కాపీ చూశాను. చాలా బావుంది.  

రాజ్‌త‌రుణ్‌, అను ఇమ్మాన్యుయ‌ల్‌, నాగ‌బాబు, పృథ్వీ, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర‌, తాగుబోతు ర‌మేష్‌, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి క‌థః శ్రీకాంత్ విస్సా, డైలాగ్స్ః సాయిమాధ‌వ్ బుర్రా, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, ఆర్ట్ః అవినాష్‌, కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గరిక‌పాటి, మ్యూజిక్ః అనూప్ రూబెన్స్‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ‌.