Home > Movies - Press Releases
మ‌హా శివ‌రాత్రి కి యమన్

విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌. ఈ సినిమాను మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత మిర్యాల రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ - ''బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోనిగారు హీరోగా నటించిన మరో మంచి చిత్రం 'యమన్‌'.  

కంప్లీట్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమా. ఇంతకుముందు సినిమాల్లో హీరోయిన్‌తో రొమాన్స్‌, సాంగ్స్‌ ఎక్కువగా లేవు. ఈ సినిమాలో మాత్రం రొమాన్స్‌, సాంగ్స్‌ వుంటాయి.  

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న మహాశివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నాం. గత సంవత్సరం బిచ్చగాడు రిలీజ్‌ అయిన టైమ్‌లోనే ఈ చిత్రాన్ని కూడా మహాశివరాత్రి కానుకగా ఫిబ్ర‌వ‌రి 24న‌ రిలీజ్‌ చేస్తున్నాం. క‌చ్ఛితంగా ఈ సినిమా బిచ్చగాడు కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుంది'' అన్నారు. 

హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - ``బిచ్చ‌గాడికి క‌థ ఎలా హీరో అయ్యిందో య‌మ‌న్ చిత్రానికి కూడా క‌థే హీరో. క‌థ విన‌గానే ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. జీవ శంక‌ర్ సినిమాను ఎంతో చ‌క్క‌గా డీల్ చేశారు. ఇది అంద‌రికీ న‌చ్చే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. న‌టుడుగా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నాకెంతో మంచి పేరు తెస్తుంది. తెలుగులో నేను చేసిన బిచ్చ‌గాడు కంటే పెద్ద హిట్ మూవీగా నిలుస్తుంది అన్నారు. 

విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, ఎడిటింగ్‌: వీరసెంథిల్‌ రాజ్‌, మాటలు: భాష్యశ్రీ, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, నిర్మాతలు: మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: జీవశంకర్‌.