Home > Movies - Press Releases
మంచి స్క్రిప్ట్ వుంటే ఆర్ జె బ్యానర్ లో చేస్తా

హరీష్‌ - అవంతిక జంటగా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై  లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. డి.జె. వసంత్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది.

'భానుమతి.. భానుమతి', 'కమాన్‌ కంట్రీ చిలకా..', 'ప్రార్థిస్తానే..', వైశాఖం టైటిల్‌ సాంగ్‌.. ఇలా అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో 'వైశాఖం' థీమ్‌ టీజర్‌కి 31 లక్షల 50 వేలు వ్యూస్‌ క్రాస్‌ చేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  యువసామాట్ర్‌ నాగచైతన్య పాల్గొన్నారు. 'వైశాఖం' చిత్రంలోని పాటల్ని, థియేట్రికల్‌ ట్రైలర్‌ని వీక్షించి చిత్ర యూనిట్‌ని అభినందించి 'వైశాఖం' ప్రోమోస్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ - ''ఫస్ట్‌ రాజుగారికి థాంక్స్‌ చెప్పాలి. సినిమాల రిలీజ్‌ విషయంలోగానీ, పబ్లిసిటీ విషయంలోగానీ, నాకు, అక్కినేని ఫ్యామిలీకి ఆయన ఇచ్చిన సపోర్ట్‌, ఎంకరేజ్‌మెంట్‌కి ఎన్ని థాంక్స్‌ చెప్పినా సరిపోదు. సాంగ్స్‌ చూస్తుంటే మంచి కంటెంట్‌ వుందనిపిస్తోంది.

మీ బేనర్‌లో ఇంకో మంచి సినిమా అవుతుందని బాగా నమ్ముతున్నాను. 'వైశాఖం' వంటి మంచి సినిమా చేసిన జయగారికి కంగ్రాట్స్‌. సాంగ్స్‌ అన్నీ చూశాను. విజువల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా వున్నాయి. ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌ ఫెంటాస్టిక్‌గా చేశారు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయి.

హరీష్‌, అవంతిక లుక్స్‌ సూపర్‌. ఈ సినిమాతో ఇద్దరు న్యూ కమర్స్‌ని ఇంట్రడ్యూస్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. న్యూ టాలెంట్‌ వస్తేనే ఇండస్ట్రీలో మంచి సినిమాలు వస్తాయి. ఇండస్ట్రీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. హీరో, హీరోయిన్‌ ఇద్దరికీ బ్రైట్‌ ఫ్యూచర్‌ వుంటుంది. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. 'వైశాఖం' సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్‌ వుంటే ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో సినిమా చేస్తాను'' అన్నారు.

డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''ఎవరినైనా హీరోని చూస్తే.. మంచి హీరో, పక్కింటి అబ్బాయిలా వున్నాడు అనుకుంటారు. కానీ నాగచైతన్యని చూస్తే మన ఇంట్లో అబ్బాయిలా అన్పిస్తాడు. అటువంటి మంచి హీరో మా ఫంక్షన్‌కి వచ్చినందుకు చాలా థాంక్స్‌'' అన్నారు.

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''ఇది మన సినిమా. మన మీడియా సినిమా. అందర్నీ కలవడం చాలా హ్యాపీగా వుంది. హీరో కాక ముందు నుంచీ చైతన్యతో పరిచయం వుంది. మంచి హీరో. మంచి మనిషి ఆయన. ఆయన స్టేటస్‌ ఏమిటో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా వుంటారు. మా మీద అభిమానంతో, ప్రేమతో వచ్చారు. మాకు చాలా హ్యాపీగా వుంది.

'జోష్‌' నుండి నిన్నటి 'రారండోయ్‌' వరకు వరుసగా హిట్‌ మీద హిట్‌ ఇస్తున్నారు. ఆగస్ట్‌లో మరో హిట్‌ కొట్టబోతున్నారు. ఆర్టిస్ట్‌గా, స్టార్‌గా ఎంతో పెద్ద ఎత్తుకి ఎదుగుతున్న చైతు విషెస్‌ మాకు అందించడం చాలా ఆనందంగా వుంది. 'వైశాఖం' జూలై సెకండ్‌ వీక్‌లో రిలీజ్‌ అవుతుంది అన్నారు.