Home > Movies - Press Releases
మార్చి 3న గుంటూరోడు

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మ‌నోజ్  మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్  గా,  సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. పక్కా మాస్ ప్లస్ వైవిధ్యమైన కధ కథనాలతో, తెరకెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ చిత్ర ట్రైలర్ కి, ఆడియో కి మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ రావడం విశేషం . 

ఈ సంద‌ర్భంగా...చిత్ర నిర్మాత వ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ - "లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా గుంటూరోడు సినిమాలో మ‌నోజ్ తన యాక్ష‌న్ తో  ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు. మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్,ల‌తో స‌హా యూనిట్ అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి  పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది.  ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 3న  విడుద‌ల చేయబోతున్నామన్నారు. రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్,  పృథ్వి  ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు."