Advertisement


Home > Movies - Press Releases
మే లో 'జయదేవ్‌'

మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి హీరోగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌'. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 27న సాయంత్రం 4.25లకు 'జయదేవ్‌' టీజర్‌ను విడుదల చేస్తున్నారు. అలాగే ఏప్రిల్‌ 30న ఈ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేస్తారు. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు స్లొవేనియాలో రెండు పాటల్ని చిత్రీకరించడం టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ. విధి నిర్వహణ కోసం తమ కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో 'జయదేవ్‌' క్యారెక్టర్‌ని డిజైన్‌ చెయ్యడం జరిగింది. ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే పది భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. కథతో లింక్‌ అయి వున్న ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాకి హైలైట్‌ అవుతాయి.'' అన్నారు.

గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌.