Advertisement


Home > Movies - Press Releases
మోహన్ బాబుపై భారీ పాట

చాన్నాళ్ల తరువాత హీరో మోహన్ బాబు మళ్లీ తెరమీదకు వస్తున్నారు. ఓ మంచి సినిమాను గాయత్రి పేరుతో నిర్మించడం ప్రారంభించారు. మదన్ దర్శకుడు. ఈ సినిమా కోసం తిరుపతి సమీపంలో ఓ భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ఆర్ట్ డైరక్టర్ చిన్నా భారీ సెట్ వేసారు. వందల మంది జూనియర్ ఆర్టిస్టులు పని చేస్తున్నారు. యాభై అడుగులకు పైగా హనుమంతుడి విగ్రహం ముందు జాతరను తలపించే సీన్ లో జై హనుమ అంటూ సుద్దాల అశోక్ తేజ రాసిన పాటను గత మూడు రోజులుగా చిత్రీకరిస్తున్నారు. శంకర్ మహదేవన్ ఈ పాటను పాడగ, థమన్ సంగీతం అందించడం విశేషం. భక్తి పాటకు ధమన్ ఓ డిఫరెంట్ స్టయిల్ ట్యూన్ ఇచ్చారు. 
ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ఈలోగా హీరోతో ముడిపడిని సీన్లు, పాట వగైరా చకచకా వర్క్ చేస్తున్నారు. పర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు కమల్ కన్నన్ యాక్షన్ సీన్లు అందిస్తున్నారు. ఇప్పటికి యాభై శాతం వరకు వర్క్ పూర్తయింది. శ్రీలక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.