Home > Movies - Press Releases
నవరసాల వైశాఖం

సినిమా ట్రయిలర్ కట్ అంటే రెండు రకాలు వుంటుంది. ఒకటి డిఫరెంట్ గా, కాంటెంపరరీగా కట్ చేయడం. ఇది ఈ మధ్య దర్శకుడు వర్మను చూసి అందరూ ఫాలో అవుతున్నారు. మరొకటి, హోటల్ మెనూ కార్డ్ మాదిరిగా తమ సినిమాలో నవరసాలు వున్నాయని తెలియ చెప్పే విధమైన సంప్రదాయ పద్దతి. మాంచి ఫ్యామిలీ మూవీగా తయారవుతున్న డైరక్టర్ బి జయ సినిమా వైశాఖం ఇప్పుడు ఈ రెండో పద్దతిని అనుసరిస్తూ ట్రయిలర్ ను అందించింది.

జూన్ మొదటి వారంలో విడుదలయ్యే ఈ సినిమా ట్రయిలర్ ను హీరో నాని చేతుల మీదగా విడుదల చేసారు. కొత్త హీరో హీరోయిన్లు హరీష్, అవంతిక నటించిన వైశాఖంలో యూత్ కు, ప్యామిలీలకు నచ్చే విధంగా లవ్, రొమాన్స్, మాస్ అప్పీల్, ఫన్, సెంటిమెంట్ అన్నీ రంగరించినట్లు ట్రయిలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు. సినిమాకు బాగా ఖర్చు చేసినట్లు ట్రయిలర్ చెప్పకనే చెబుతోంది. అదేవిధంగా కొత్త హీరో, హీరోయిన్లు అన్ని విధాలా ట్రయిన్ అయినట్లు ట్రయిలర్ లో క్లియర్ అయింది. ట్రయిలర్ లో వేసిన రెండు డైలాగులు కూడా హార్ట్ టచింగ్ గా వున్నాయి. 'తీసుకెళ్లే దేవుడి కన్నా, మోసుకెళ్లే మనుషులే ముఖ్యం' అన్న హ్యూమన్ రిలేషన్ల డైలాగు బాగా పండే అవకాశం వుంది.