Home > Movies - Press Releases
నితిన్ లుక్ అదిరిందిగా

అ ఆ తరువాత నితిన్ ను తెరపై చూడడం కుదరలేదు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్న డైలాగ్ లా ఇప్పుడు కొత్తలుక్ తో వచ్చేసాడు నితిన్. డైరక్టర్ హను రాఘవపూడి డైరక్షన్లో  14 రీల్స్‌ భారీ చిత్రం 'లై' ఫస్ట్‌ లుక్‌ ను నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసారు.  ఈ లుక్ కచ్చితంగా కాంటెంపరరీ సినిమా అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఇటీవల తెలుగు హీరోలు అందరూ గెడ్డం పెంచుతున్నట్లుగానే నితిన్ కూడా అలాగే కనిపించాడు. కానీ ఆ గెటప్, కళ్లజోడు మొత్తం మీద పూర్తి వైవిధ్యంగా కనిపించాడు. పైగా సినిమా కు టైటిల్ కూడా చిత్రంగా వుంది. లై..లవ్, ఇంటిలిజెంట్, ఎనిమిటీ అంటూ సినిమా లైన్ ను లైట్ గా చెప్పే ప్రయత్నం చేసారు.

ఇదిలా వుంటే ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా  నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా 'లై' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. హైదరాబాద్‌లో ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ జరిగింది. ఏప్రిల్‌ 4న అమెరికా షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. జూన్‌ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్‌లో వెగాస్‌, లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.