Advertisement


Home > Movies - Press Releases
న‌వంబ‌ర్ 3న "నెక్ట్స్ నువ్వే"

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో  నిర్మాత బ‌న్ని వాసు నిర్మించిన "నెక్ట్స్ నువ్వే"  చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దలయింది.   హీలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైభ‌వి, ర‌ష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ అందించారు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసుకుని న‌వంబ‌ర్ 3 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎ స‌ర్టిఫికేట్ తో విడుదలకు సిద్దమయింది.

ఈ సందర్భంగా నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం నెక్స్‌నువ్వే న‌వంబ‌ర్ 3 న విడుద‌ల చేస్తున్నాం.  ఈ చిత్రంతో ప్ర‌భాక‌ర్‌.పి ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. మంచి కాన్సెప్ట్ ఆడియ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చెయ్య‌టమే ల‌క్ష్యం గా ఈ చిత్రాన్ని చేశాము. హీరో ఆదిసాయికుమార్ కెరీర్ లో ఇది మంచి విజ‌యం గా నిలుస్తుంది. వైభ‌వి, ర‌ష్మి, అవ‌స‌రాల శ్రీనివాస్, బ్ర‌హ్మ‌జి, ర‌ఘు మంచి పాత్ర‌ల్ల క‌నిపిస్తారు. సెన్నారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 3న విడుద‌లవుతుంది. హ‌ర్ర‌ర్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. అని అన్నారు