Home > Movies - Press Releases
నవంబ‌ర్ 30న `ఇంద్ర‌సేన‌`

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో  తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా నటిస్తోన్న చిత్రం `ఇంద్రసేన`. ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై జి.శ్రీనివాసన్ దర్శ‌క‌త్వంలో రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని `ఇంద్రసేన` చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా ఏక కాలంలో న‌వంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ - ``డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగులో త‌నకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న విజ‌య్ ఆంటోనికి సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ వుంది. మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న విజ‌య్ ఆంటోని `బిచ్చ‌గాడు`తో  సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. త‌ర్వాత భేతాళుడు, యెమ‌న్ చిత్రాల‌తో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా స‌క్సెస్ సాధించారు. ఇప్పుడు `ఇంద్ర‌సేన` చిత్రంలో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆక్టుకోవ‌డానికి సిద్ధ‌మైయ్యారు

విజ‌య్ ఆంటోని. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో పాటు హై ఎమోష‌న్స్ కాంబినేష‌న్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అల్రెడి విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా అద్భుతంగా వ‌చ్చింది. అంచ‌నాల‌ను అందుకునేలా సినిమా ఉంటుద‌న‌డంలో సందేహం లేదు. నవంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు,త మిళంలో సినిమా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. 

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా,  జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.