Advertisement


Home > Movies - Press Releases
'ఓ పిల్లా నీ వ‌ల్లా' కు స్పందన బాగుంది

కిషోర్ స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో బిగ్‌విగ్‌ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మించిన చిత్రం 'ఓ పిల్లా నీ వ‌ల్లా'.  కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులు. ఇటీవ‌ల‌ రిలీజైన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఆద‌ర‌ణ బావుందని, అన్ని  ఏరియాల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చిందని. ఈ సీజ‌న్‌లో చ‌క్క‌ని విజువ‌ల్ ట్రీట్ అంటూ ప్రేక్ష‌కులనుంచి ప్ర‌శంస‌లు అందుతున్నాయని నిర్మాత, దర్ళకుడు కిషోర్ ఆనందం వ్యక్తం చేసారు.  

ద‌ర్శ‌క‌ నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - 'ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని వినోదాత్మ‌క చిత్రమ‌ని తొలి నుంచి చెప్పాం. ల‌వ్‌, కామెడీ, యాక్ష‌న్ హైలైట్‌గా అన్ని వ‌ర్గాల్ని మెప్పించే అంశాలతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇటీవ‌ల రిలీజై విజ‌యవంతంగా ర‌న్ అవుతోంది.  ఇంత‌టి చ‌క్క‌ని విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు' అని తెలిపారు.

హీరో కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ - 'ఓ మంచి కాన్సెప్టు ఉన్న చిత్రంలో అవ‌కాశం క‌ల్పించినందుకు నా ద‌ర్శ‌క‌నిర్మాత‌కు కృత‌జ్ఞ‌త‌లు.' అన్నారు.

క‌థానాయిక‌లు మాట్లాడుతూ - 'ఓ మంచి చిత్రంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. సక్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. కిషోర్‌గారు మ‌రిన్ని మంచి సినిమాలు తీయాలి' అన్నారు.