Home > Movies - Press Releases
అక్టోబర్ 13న రాజుగారి గది 2

నాగార్జున తొలిసారిగా హర్రర్ కామెడీ జోనర్ లో చేస్తున్న రాజుగారి గది 2 సినిమా విడుదల డేట్ వచ్చేసింది. ఆగస్టు 25న వస్తుందనుకున్న సినిమా, చైతూ సినిమా వుండడం, ఇంకా మరి కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 13న  వస్తోంది. రాజుగారి గది సినిమాకు దర్శకుత్వం వహించిన ఓంకార్ నే ఈ సినిమాకు కూడా దర్శకుడు.  "క్షణం, ఘాజీ" లాంటి డీసెంట్ హిట్స్ అనంతరం పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నేటితో ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "'రాజుగారి గది" సినిమా సూపర్ హీట్ అవ్వడంతో "రాజుగారి గది 2" కోసం ప్రేక్షకలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా "రాజుగారి గది 2" రూపొందుతుంది. నాగార్జున ఈ చిత్రంలో చాలా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.  

"రాజుగారి గది" అక్టోబర్ లో విడుదలై ఘన విజయం సొంతం చేసుకొంది, అందుకే "రాజుగారి గది 2"ని కూడా అక్టోబర్ నెలలో 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అదే స్థాయిలో "రాజుగారి గది 2" కూడా ఘన విజయం సాధిస్తుందన్న పూర్తి నమ్మకం మాకుంది" అన్నారు.