Home > Movies - Press Releases
ప్రముఖులకు వైశాఖం

సాధారణంగా సినిమాలు ఎవరికి మాత్రం ఇష్టం వుండవు. ప్రముఖులు చాలా మందికి ఇళ్లలో క్యూబ్ కనెక్షన్లు వున్నాయి. వాళ్లకు ఏదైనా సినిమా ఇణట్రెస్టింగ్ వుండి, చూడాలనుకుంటే, క్యూబ్ లాక్ తీసుకుని, చూడడం కామన్. ఈవారం విడుదలైన ఫ్యామిలీ సినిమా వైశాఖం ను క్యూబ్ లో చూసేందుకు కొందరు ప్రముఖులు కీ లు అడిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫ్యామిలీ సభ్యులు, అలాగే బెంగుళూరులో వుండే జిఎమ్ఆర్ గ్రూప్ మల్లికార్జున రావు కుటుంబ సభ్యులు క్యూబ్ కీ లు తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాబంధు సుబ్బరామిరెడ్డి కూడా వైశాఖం చూసారట. మరి అలా క్యూబ్ కీ లు తీసుకుని, ఎవరు చూసారో? ఎలా ఫీలయ్యారో తెలియాల్సి వుంది.

ఇదిలా వుంటే వైశాఖం సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు నాలుగు వందల థియేటర్లలో విజయవంతగా ప్రదర్శితమవుతున్నట్లు నిర్మాత తెలిపారు.