Home > Movies - Press Releases
పుణ్యక్షేత్రాలకు సప్తగిరి ఎక్స్ ప్రెస్

సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటే కేవలం తిరుపతికే వెళ్తుందనుకుంటారేమో? కాదు, కాదు, శ్రీశైలం, షిర్డీ కూడా చుట్టేయబోతోంది. బడ్జెట్ లో కొత్త రైలు అనుకోవద్దు. ఇది కమెడియన్ సప్తగిరి సినిమా రైలు.

శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం డాక్టర్ రవికిరణ్ నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. కమెడియన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 23న  విడుదల అవుతోంది.

ఈ సందర్భంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహస్తోంది. ఈ బృందం ముందుగా డిసెంబర్ 17న శ్రీశైలం డిసెంబర్ 20న తిరుపతి, డిసెంబర్ 21న షిరిడి వెళ్లేలా సన్నాహాలు చేసినట్లు నిర్మాత రవికిరణ్ తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు, టీజర్ కు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని నిర్మాత తెలిపారు. ఈ సినిమాతో కన్నడ భామ రోషిణి ప్రకాష్, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

హైదరాబాద్, పోలాండ్, జర్మనీల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ షూటింగ్ జరిగింది. సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని చిత్ర బృందం తెలిపింది. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.