Home > Movies - Press Releases
రాధకు దన్నుగా ఆ ఇద్దరు?

శర్వానంద్ లేటెస్ట్ సినిమా రాధ. ఈ సినిమా ఎప్పడో పూర్తయింది, జనవరిలో విడుదలవ్వాల్సింది, ఇప్పటికి డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కాస్త పెద్ద తలకాయలే అండగా నిల్చున్నాయి. శర్వాతో మంచి సంబందాలు వున్న యువి క్రియేషన్స్ వంశీ ఇప్పటికే ఈ సినిమా చూసి, చిన్ని చిన్ని కరెక్షన్లు చెప్పి, తన వంతు పంపిణీ సాయం ప్లాన్ చేస్తున్నారట.

డిస్ట్రిబ్యూషన్ కింగ్ అయిన దిల్ రాజు కూడా రంగంలోకి దిగారు. శర్వాతో ఇటీవలే హిట్ కొట్టిన ఆయన ఈ రోజు సినిమా చూసి, తను కూడా ఓ చేయి వేయడానికి సిద్దం అయిపోయారు. ఇదిలా వుంటే ఈరోజు రాధ సెన్సారు పూర్తయింది.  120 గంటలకు జస్ట్ కొద్ది నిమషాలు ఎక్కువ నిడివి వున్న ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది.సీనియర్ ప్రొడ్యూసర్ బోగవిల్లి ప్రసాద్ నిర్మిచిన ఈ సినిమా చంద్రమోహన్ దర్శకుడు.