Home > Movies - Press Releases
రాజకుమారి అదృష్టం

ఈ వారం విడుదలవుతున్నాయి మూడు చిన్న సినిమాలు. సునీల్ ఉంగరాల రాంబాబు, సచిన్ వీడెవడు, నారా రోహిత్ కథలో రాజకుమారి. ఈ మూడు సినిమాల్లో వీడెవడు సినిమాకు జయాపజయాలతో సంబంధం లేదు. సచిన్ తన ఫాషన్ కోసం చేసే సినిమాల్లో అది ఒకటి.

ఇక పబ్లిసిటీ, ఫ్రింట్లు అన్నీ కలుపుకుని ఉంగరాల రాంబాబు, కథలో రాజకుమారి అయిదారు కోట్లతో తెరకెక్కిన సినిమాలు. రెండూ కూడా కొన్ని ఏరియాలు అమ్మినవి, కొన్ని విడుదల చేసుకుంటున్నవి.

అయితే ఈ రెండింటిలో కథలో రాజకుమారికి వున్న అడ్వాంటేజ్ ఏమిటంటే శాటిలైట్ అయిపోవడం. 2.80కోట్లకు కథలో రాజకుమారి శాటిలైట్ అగ్రిమెంట్ అయిపోయింది. కొన్ని ఏరియాలు అమ్మగలిగారు.

అంటే మరో రెండు కోట్లు రాబట్టుకోగలిగితే గట్టెక్కేసినట్లే. ఉంగరాల రాంబాబు శాటిలైట్ ఇంకా అయిన వార్తలు రాలేదు. ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల  రికవరీ రేస్ లో మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే రాజకుమారి కాస్త ముందు వుందన్న మాట.