Home > Movies - Press Releases
రాజుగారు పబ్లిసిటీ కుమ్మేస్తున్నారు

పీఆర్వో అంటే నే సినిమాకు బజ్ తీసుకువచ్చి, పబ్లిసిటీ పీక్ లో వుండేలా చూసుకోవడం. అయితే నిర్మాత స్థోమత బట్టి పీఆర్వో కెపాసిటీ కనిపిస్తుంది. అదే పీఆర్వోనే నిర్మాత అయితే. పబ్లిసిటీ పీక్స్ లో వుంటుంది. ఈ వారం విడుదల కాబోయే వైశాఖం సినిమా పబ్లిసిటీ అలాగే వుంది.

గతంలో అనేక హిట్ సినిమాలు తీసిన బిఎ రాజు ఈ సినిమాకు నిర్మాత. లవ్ లీ వంటి హిట్ సినిమా అందించిన జయ దర్శకురాలు. చిన్న సినిమా అయినా ఖర్చుకు వెరవకుండా ఏడుకోట్లు ఖర్చు చేసి, రిచ్ లుక్ తో వుండేలా తీసారు. పైగా సినిమాటోగ్రఫీకి ఆధునిక టెక్నాలజీ వాడారు. అందువల్ల సినిమా రీచ్ కు ఎలాంటి లోపం రాకూడదని, పబ్లిసిటీని అదరగొట్టేస్తున్నారు.

సినిమాను మంచి రేట్లకే విక్రయించారు. పాటలకు ఇప్పటికే మాంచి ఆదరణ లభించింది. ట్రయిలర్ ను తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఇప్పటికే మోత మోగించారు. దాంతో సినిమా మీద కాస్త ఆసక్తి నెలకొంది. ఇది మరింత పెరగాలని పబ్లిసిటీ ఓ రేంజ్ లో చేస్తున్నారు. దీంతో పోల్చుకుంటే అదే రోజు విడుదలవుతున్న ఫిదా సినిమాకు అస్సలు పబ్లిసిటీనే లేకపోవడం విశేషం.