Advertisement


Home > Movies - Press Releases
ఆర్ఎఫ్సీ కి అనాధపిల్లలు

హీరో సునీల్ కు అనాధపిల్లలు అన్నా, హ్యాండీ క్యాప్డ్ పిల్లలన్నా కాస్త ఆదరణ వుంది. తరచు అలాంటి వారుండే ఆశ్రమాలకు వెళ్తుంటాడు. వాళ్లతో గడుపుతూ వుంటాడు. అలా వెళ్లే వాటిలో సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూలు ఒకటి. గత ఏడాది ఇదే సంస్థకు చెందిన అనాధపిల్లలకు పెద్ద టీవీ ఒకటి బహురించాడు. 

ఈ మధ్య ఆ పిల్లలతో గడపడానికి వెళ్లినపుడు, వాళ్లంతా రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలని అడిగారట. దాంతో ఒకేసారి ముఫైమంది పిల్లలను తనే ట్రాన్స్ పోర్ట్ అరేంజ్ చేసి, మంగళవారంనాడు రామోజీ ఫిలిం సిటీకి పంపించాడు. అంతేకాదు, తాను కూడా వెళ్లి అక్కడ వాళ్లతో ఒకగంట గడిపి వచ్చాడు. 

ఎన్ని సినిమాలు చేసాం, ఎంత సంపాదించాం, ఎన్ని విజయాలు సాధించాం అన్నది మాత్రమే కాదు, ఇలాంటివి కూడా ఎంతో ఆనందం కలిగిస్తాయి, అందుకే ఇలా చేసా అంటున్నాడు సునీల్. డబ్బులు ఇచ్చేస్తే, వాళ్లే అరేంజ్ చేసుకుంటారు. కానీ తాను కూడా అక్కడకు వెళ్లి, ఆ అనాధల ఆనందం చూస్తే, అదో తృప్తి అంటున్నాడు సునీల్. గుడ్ వర్క్. కీపిట్ అప్.