Home > Movies - Press Releases
'రోగ్' బాగున్నాడుగా

ఈ మధ్య కాస్త పైసలు వుంటే చాలు, సిక్స్ ప్యాక్ చేసేయడం, ఫైట్లు, డ్యాన్స్ లు నేర్చేసుకోవడం సినిమాల్లోకి వచ్చేయడం. ఎక్కువ పైసలు బ్యాకింగ్ వుంటే చూడగా చూడగా వాళ్లకే ఈ మొహాలు అలవాటైపోతాయని అలా తీస్తూ పోవడం. ఆఖరికి ఎక్కడో హిట్ కొట్టి సెటిలైపోవడం. లేదు. సినిమా బాగాలేకపోతే, ఈ ఫేస్ ఏంట్రా బాబూ అని జనం పక్కన పెడతారు. దాంతో బుద్దిగా వెనక్కు వెళ్లిపోతారు. 

ఆ మధ్య కుమారస్వామి కొడుకు జాగ్వార్ అంటూ భారీ సినిమాతో వస్తే, అలాగే వెనక్కు పంపారు. వైజాగ్ రాజు కొడుకు కార్తీక్ రాజు నేనున్నా అంటూ వస్తే అతగాడినీ దాదాపు వెనక్కు పంపేసారు. ఇలాంటి ఉదాహరణలు చాలానే వున్నాయి. ఇప్పుడు లెటెస్ట్ గా మరో నిర్మాత కొడుకు స్క్రీన్ మీదకు వస్తున్నాడు. హీరో శ్రీకాంత్ తో ఒకటి రెండు సినిమాలు నిర్మించిన పారిశ్రామిక వేత్త సిఆర్ మనోహర్ తన సోదరుడి కుమారుడు ఇషాన్ ను హీరో పరిచయం చేస్తున్నారు.

పూరి జగన్నాధ్ దర్శకుడు. రోగ్ పేరుతో తీస్తున్న ఈ సినిమా హీరో స్టిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. మరీ చాలా మంది వారసుల్లా కాకుండా చూడ్డానికి కాస్త బాగానే వున్నాయి. హీరో మెటీరియల్ క్లియర్ గా వుంది. మరి పూరి చేతిలో పడ్డాడు కాబట్టి ఏక్టింగ్ కూడా బాగా చేస్తే ఓకె అనిపించుకుంటాడు. కానీ ఎటొచ్చీ పూరితోనే సమస్య. సినిమాను సీరియస్ గా తీసారో లేదో?