Home > Movies - Press Releases
సేఫ్ జోన్ లో ‘బాబు’

బాబు బాగా బిజీ అంటూ మాంచి కసక్కులాంటి సినిమా తీసి బయటకు వదుల్తున్నారు.  హిందీ హంటర్ కు తెలుగు రీమేక్. ట్రయిలర్ చూస్తేనే, సి సెంటర్ జనాలు కచ్చితంగా మార్నంగ్ షోలకు రెడీ అయిపోయేలా వుంది. అందుకే బాహుబలి 2 వచ్చిన వారానికే థియేటర్లలోకి పంపుతున్నారు. జస్ట్ మూడున్నర కోట్ల నుంచి మూడు డెభై అయిదు మధ్య పబ్లిసిటీ ఖర్చుతో కలిసి కానిచ్చేసారు.

ఆంధ్రను రెండున్నర కోట్ల రేషియోలో అమ్మేసి, సీడెడ్ యాభైకు ఇచ్చేసి, నైజాం వుంచుకున్నారు నిర్మాత అభిషేక్ పిక్చర్స్. అంటే ఇంక 75 రికవరీ కావాలన్నమాట నైజాం నుంచి. శాటిలైట్ ఎలాగూ కాదు ఇలాంటి సినిమాలకు. అందుకే అమెజాన్ ప్రయిమ్ కు కోటిన్నరకు ఆఫర్  పెట్టారు కనీసం కోటి వచ్చినా ఖర్చు అంతా రికవరీ అయిపోయినట్లే. నైజాం ఏమి వస్తే అది లాభం అన్నమాట.

మొత్తం మీద బాబు బాగా సేఫే.