Home > Movies - Press Releases
శమంతకమణి కి క్లీన్ యు

ఈమధ్య కాలంలో క్లీన్ యు అనే మాట వినడం అరుదయిపోయింది. పైగా క్లీన్ యు సర్టిఫికెట్ వుంటే జనం థియేటర్ కు రారేమో? యు/ఎ వుండాలేమో అన్న అనుమానాలు వున్నాయి. అలాంటి టైమ్ లో ఓ మాంచి థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీకి క్లీన్ యు సర్టిఫికెట్ సాధించడం అంటే ఆ సినిమా డైరక్టర్ ను మెచ్చుకోవాలి.

నలుగురు హీరోలు ఆది, నారా రోహిత్, సందీప్, సుధీర్ కుమార్ లతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఎంటర్ టైన్ మెంట్ థ్రిల్లర్ శమంతకమణి ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది.

థ్రిల్లర్ సినిమాను ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా, క్లీన్ గా తీయడం మెచ్చుకోవాల్సిన సంగతే అని సెన్సారు సభ్యులు ప్రశంసించారని భవ్య మూవీస్ యూనిట్ సభ్యులు ఆనందపడుతున్నారు. శమంతకమణి ఈ నెల 14న థియేటర్లలోకి వస్తోంది.