Home > Movies - Press Releases
సందీప్ కోసం రకుల్

హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహితులు. అందుకే ఇప్పుడు ఆ స్నేహంతోనే సందీప్ నటించిన కేరాఫ్ సూర్య సినిమాలో పాటను ఆన్ లైన్ లో విడుదల చేస్తూ, సినిమాకు బాసగటగా నిలుస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.  సందీప్ కిషన్, మెహ్రీన్ జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, సుశీంద్రన్ దర్శకత్వంలో, శంకర్ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో  చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఈ సినిమాలో అమ్మాయిల గొప్ప‌త‌నాన్ని వర్ణిస్తూ రామ‌జోగ‌య్య శాస్ట్రి అందించిన టాలీవుడ్ క్రేజి హీరోయిన్ ర‌కూల్ ప్రీత్ సింగ్ అక్టోబ‌ర్ 6న విడుదల చేయబోతోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య చిత్ర టీజర్ ను రిలీజ్ చేశాము. డిజిట‌ల్ వ్యూస్ దాదాపు  3ం లక్ష‌ల‌కు పైగా రావ‌టం హ్యాపిగా వుంది. అంతేకాకుండా ట్రేడ్ లో బిజినెస్ కూడా స్పీడ్ అందుకోవ‌టం విశేషం. సందీప్ కిషన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నాం.  ఇమ్మాన్ మ్యూజిక్ మరో ఎస్సెట్ గా నిలవబోతోంది. త్వరలోనే భారీ ఈవెంట్ తో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం. 

సందీప్ కిషన్ మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య షూటింగ్ దశలోనే నాకు పూర్తి సంతృప్తి ఇచ్చిన చిత్రం. అలాంటి చిత్ర టీజర్ ను నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన నాని రిలీజ్ చేయడం, ఇప్పుడు మ‌రో బెస్ట్ ఫ్రెండ్ ర‌కూల్ ప్రీత్ సింగ్ ఈచిత్రం సింగిల్ విడుద‌ల చేయ‌టం  చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుందని అన్నారు.