Advertisement


Home > Movies - Press Releases
సప్తగిరి రివాల్వర్ రాజు

కమీడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సప్తగిరి. కమెడియన్ గా రాణిస్తూనే హీరోగా కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు సప్తగిరి.

ప్రస్తుతం నాగచైతన్య, కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కామెడీ క్యారెక్టర్లు చేస్తూనే, హీరోగా మళ్లీ మరో సినిమా చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమాకు 'రివాల్వర్ రాజు' అని టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడట. డైరక్షన్ సైడ్ నుంచి వచ్చిన సప్తగిరి ఈసారి మరింత పటిష్టమైన కథ, కథనాలను సమకూర్చుకుని, తనలోని హీరోని శాటిస్ ఫై చేసే విధంగా మరో సినిమాను అందించడానికి రెడీ అవుతున్నాడట. స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ వివరాలు త్వరలో ప్రకటిస్తాడట.