Home > Movies - Press Releases
సురేష్‌ కొండేటి గెలుపు
ఫిల్మ్‌నగర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో సుదీర్ఘకాలం సభ్యుడిగా ఉండి ఏ పదవి లేకుండానే  అభివృద్ధికి సంవత్సరాల తరబడి పాటుపడ్డ వ్యక్తి సురేష్‌కొండేటి. తన పనితనాన్ని గుర్తించి పెద్ద‌లు గత నాలుగు సంవత్సరాల‌ క్రితం ఎఫ్‌.ఎన్‌.సి.సి.క‌ల్చ‌రల్‌ కమిటీ సభ్యుడిగా మరియు ప్రచార కమిటీకి చైర్మెన్‌గా నియమించారు. వారి మాటను శిరశావహిస్తూ... సురేష్‌కొండేటి తన వంతు కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధితో నెరవేర్చారు. దానిని దృష్టిలో పెట్టుకునే గత రెండు సంవత్సరాల‌ క్రితం ఎఫ్‌.ఎన్‌.సి.సి. క‌ల్చ‌ర‌ల్‌ కమిటీ చైర్మెన్‌గా నియమించారు. ఈ సారి సురేష్‌కొండేటి చేసే హార్డ్‌వర్క్‌ని గుర్తించి డా.కె.యల్‌.నారాయణగారి ప్యానల్‌లో ‘మేనేజ్‌మెంట్‌ కమిటీ మెంబర్‌’గా పెద్ద‌లు నియమించారు. 
 
అయితే అనుకోకుండా కొన్ని పోస్టుల‌కు హోరా హోరీగా ఎన్నిక‌లు సాగాయి. ఈ ఎన్నిక పోటీలో మేనేజ్‌మెంట్‌ కమిటీ మెంబర్‌గా సురేష్‌కొండేటి విజయం సాధించారు. ఈ సందర్భంగా సురేష్‌కొండేటి మాట్లాడుతూ.. ‘‘డా. కె.వెంకటేశ్వరరావు (కె.వి.ఆర్‌),  అల్లు అరవింద్‌,  ఆదిశేషగిరిరావు,  కె.యస్‌.రామారావు, డి. సురేష్‌బాబు,  డా.కె.యల్‌.నారాయణ,   కాజా సూర్యనారాయణ,  శ్రీనివాసరాజు,  రాజశేఖర్‌రెడ్డి,  తుమ్మ రంగారావు,  భాస్కర్‌ నాయుడు ఇలా.... పెద్ద‌లందరూ నన్ను మేనేజ్‌మెంట్‌ కమిటీ మెంబర్‌’గా నియమించారు. ముందుగా వీరికి శిరస్సువంచి నా కృతజ్ఞత‌లు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతీ మెంబర్‌కీ హృదయపూర్వక కృతజ్ఞత‌లు తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు.