Advertisement


Home > Movies - Press Releases
త‌మిళం లో సందీప్ కిష‌న్‌ కు మరో హిట్టు

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కు 2017 కొంచెం తీపి, చేదు ని క‌లిగించింద‌నే చెప్పాలి. ఈ ఏడాది విడుద‌ల‌య్యిన‌ ‘నగరం’.. ‘శమంతకమణి’.. ‘C/o సూర్య’ చిత్రాలు క్రిటిక‌ల్ ఎప్లాజ్ ని సొంతం చేసుకున్నాయి. న‌ట‌న‌లో మెచ్యూరిటీ క‌నిపిస్తూ వ‌చ్చింది. అలాగే న‌క్ష‌త్రం లో న‌టుడుగా త‌న క‌ష్టం క‌నిపించినా చిత్రం ఆక‌ట్టుకొలేదు. ఐతే త‌మిళం లో  మాత్రం సందీప్ కు మంచి ఫలితాలే దక్కుతున్నాయి. ఈ ఏడాది వచ్చిన ‘నగరం’ తమిళంలో సూపర్ హిట్టయింది. ‘C/o సూర్య’ తమిళ వెర్షన్ నుంచి మంచి ప్ర‌శంసలు వ‌చ్చాయి. ఈ లోపు సందీప్ కిష‌న్ నటించిన మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే.. మాయావన్. మాయావన్ తెలుగు వెర్ష‌న్ లో ప్రాజెక్ట్ జెడ్ పేరుతో విడుద‌ల‌కి సిధ్ధంగా వుంది. 

విభిన్నమైన సినిమాలతో నిర్మాతగా గొప్ప పేరు సంపాదించిన సి.వి.కుమార్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం మాయావ‌న్‌. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. జాకీష్రాఫ్ కీలక పాత్ర పోషించాడు. ఈ థ్రిల్లర్ మూవీ ఈ వార‌మే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి ముందుగానే ప్రివ్యూలు వేయగా.. మంచి స్పందన వచ్చింది.  థియేటర్లలో కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. రివ్యూలు బాగున్నాయి. ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనం.... సందీప్ కిషన్ పెర్ఫామెన్స్ సూపర్ అని ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్రం తెలుగులోకి ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో త్వరలోనే విడుదల చేయబోతున్నారు. 

త‌మిళ హీరోలు తెలుగు మార్కెట్ ని సొంతం చేసుకుంటున్నారు కాని తెలుగు హీరోలు చాలా త‌క్కువ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే చెప్పాలి.. కాని సందీప్ కిష‌న్ మాత్రం త‌మిళ మార్కెట్ లో వ‌రుస విజ‌యాల‌తో ఓ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడనే చెప్పాలి.  మెత్తానికి మాయావన్ తో సందీప్ కిష‌న్ త‌మిళ మార్కెట్ లో మ‌రో హిట్ ని సొంతం చేసుకున్నాడు.