Advertisement


Home > Movies - Press Releases
తెలుగులోకి జాలీ ఎల్ఎల్ బి

జాలీ ఎల్ఎల్ బి బాలీవుడ్ లో రెండు సినిమాలుగా వచ్చింది. 2013లో తొలి సినిమా విడుదలైంది. పది కోట్ల చిన్నబడ్జెట్ తో వచ్చి నలభై కోట్ల వరకు వసూళ్లు సాగించింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా మీద టాలీవుడ్ జనాల కన్ను పడింది. హీరోగా సెటిల్ కావాలని ప్రయత్నిస్తున్న కమెడియన్ సప్తగిరి ఇప్పుడు ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హక్కుల రేట్లు కాస్త ఎక్కువ చెప్తున్నారని వినికిడి. ఎక్కువంటే మరీ ఎక్కువ కాదు. యాభై లక్షల రేంజ్ లో వుంది రేటు. దాన్ని కాస్త తగ్గించమని బేరాలు సాగుతున్నాయి.

కోర్టు వాదనలు, కేసు పరిశోధన నేపథ్యంలో సాగే కామెడీ సినిమా ఇది. నిజానికి ఇది ఒక విధంగా గతంలో సీనియర్ వంశీ డైరక్ట్ చేసిన చెట్టు కింద ప్లీడర్ సినిమాకు దగ్గరగావుంటుంది. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిందీ సినిమా. అందుకే జాలీ ఎల్ ఎల్ బి కూడా తెలుగువారికి నచ్చుతుందని అనుకుంటున్నారు. దోచేయ్ సినిమాలో డమ్మీ లాయర్ గా సప్తగిరి కామెడీ జనాలను భలే అలరించింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా. అందుకే ఆ క్యారెక్టర్ కు ఫుల్ లెంగ్త్ గా వుటుంది. పైగా ఆసక్తికరమైన పరిశోధన వుంటుందని జాలీ ఎల్ఎల్ బి కోసం హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు.