Home > Movies - Press Releases
తెలుగులోకి రంగతరంగ డైరక్టర్

తన మొదటి సినిమాతోనే ఆస్కార్‌ అవార్డ్‌ నామినేషన్‌ వరకు వెళ్ళిన దర్శకుడు అనూప్‌ భండారి. ఆయన ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేస్తున్నారు. జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి  'రాజరథం' పేరుతో నిర్మిస్తున్న చిత్రానికి అనూప్ భండారి ని డైరక్టర్ గా ఎంచుకున్నారు. తెలంగాణలోని గొల్లపల్లికి చెందిన అజయ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన తెలుగు, కన్నడ భాషల్లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. తెలుగులో 'రాజరథం' పేరుతో, కన్నడలో 'రాజరథ' పేరుతో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్‌ కామెడీతోపాటు అడ్వెంచర్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అక్టోబర్‌ 2న విడుదల చేశారు.

ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన అజయ్‌రెడ్డి గొల్లపల్లి మాట్లాడుతూ ''ఒక యునీక్‌ సబ్జెక్ట్‌తో సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యాము. ఎక్స్‌ట్రీమ్‌ టాలెంట్‌ కలిగిన రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు అయిన అనూప్‌ భండారిని అప్రోచ్‌ అయ్యాము. రంగతరంగ చిత్రంలో  నటించిన నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి మరోసారి 'రాజరథం' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం తమిళ్‌ హీరో ఆర్యను ఎంపిక చేశాం'' అన్నారు.

దర్శకుడు అనూప్‌ భండారి మాట్లాడుతూ ''ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో వేర్వేరుగా చిత్రీకరించడం జరిగింది. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. ఈ పోస్టర్‌లో హీరో, హీరోయిన్‌, రవిశంకర్‌ ఫస్ట్‌లుక్‌లను రివీల్‌ చేసాం. కాస్ట్యూమ్‌ డిజైనర్‌, అనూప్‌ భండారి సతీమణి నీతాశెట్టి ఈ సినిమాకు కాస్ట్యూమ్స్‌ని ప్రత్యేకంగ డిజైన్‌ చేశారు . త్వరలోనే ఆర్యకు సంబంధించిన సోలో లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని'' తెలిపారు. 

ఈ చిత్రంలో ఆరు పాటలున్నాయి. ఈ పాటలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. అనూప్‌ భండారి ఈ పాటలకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి మాటలు అబ్బూరి రవి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అజనీష్‌ లోక్‌నాథ్‌, ఎడిటింగ్‌: శాంతకుమార్‌, సినిమాటోగ్రఫీ: విలియమ్‌ డేవిడ్‌, నిర్మాణం: జాలీహిట్స్‌ టీమ్‌ అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్‌శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం,: అనూప్‌ భండారి.