Home > Movies - Press Releases
ఉంగరాల రాంబాబు రెడీ

‘జక్కన్న’ సునీల్ హీరోగా, ఓనమాలు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. కొద్దిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం మిగిలాయి. ఈ చిత్రాన్ని స‌మ్మర్ కానుకగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ గత అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు, నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వర‌లోనే టీజ‌ర్ ని విడుద‌ల చేసి, త్వర‌లో ఆడియోని విడుద‌ల చేస్తారు.